మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల సర్జరీ చేయించుకుని, ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఆయన త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న RC17 షూటింగ్‌ను ప్రారంభిస్తాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తవ్వగా, నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల ఎంపికలో చిత్రబృందం బిజీగా ఉంది.
ఈ క్రమంలోనే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కన్నడ భామ రుక్మిణి వసంత్ పేరు జోరుగా వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న రుక్మిణి, ప్రస్తుతం RC17 కోసం ఫస్ట్ ఛాయిస్‌గా ఉన్నట్లు టాక్. అయితే, త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.
మరోవైపు ఈ సినిమాకు సంగీత దర్శకుడిని ఖరారు చేసే పనిలో కూడా మేకర్స్ ఉన్నారట. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫాస్ట్ షెడ్యూల్స్‌లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. స్టైలిష్ యాక్షన్ డ్రామాగా రానున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.


