సూపర్ స్టార్ రజినీకాంత్ నటించించిన ‘లింగ’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దాదాపు 4 సంవత్సరాల తర్వాత రజినీకాంత్ నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా కోసం ఇంకాస్త టైం ఉంది అందుకే లింగ టీం ఎఆర్ రెహమాన్ అందించిన ఆడియోని నవంబర్ 16న రిలీజ్ చేసారు. కానీ ఆ ఆడియో ఆల్బమ్ ఆడియన్స్ ని అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది.
ఎఆర్ రెహమాన్ రజినీకాంత్ కాంబినేషన్ అనగానే సూపర్ హిట్ ఆల్బమ్స్ అయిన నరసింహా, శివాజీ, రోబో, కొచ్చాడియాన్ సినిమాల లానే ఈ సినిమా ఆడియో కూడా సూపర్బ్ గా ఉంటుందని అందరూ ఆశించారు. కానీ లింగ పాటలు చాలా రొటీన్ అండ్ ఆర్డినరీగా ఉండడంతో అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. మరి సినిమాలో అన్నా పాటలు ఆకట్టుకుంటాఏమో చూడాలి. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.


