మనోహరుడు పాటలు రెడీ – రెహమాన్.!

ar-rehman
తమిళ స్టార్ హీరో విక్రమ్, అమీ జాక్సన్ జంటగా శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘మనోహరుడు’. తమిళంలో ‘ఐ’ పేరుతో రూపొందుతుంది. స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో పాటలన్నీ రెడీ అయ్యాయి. రికార్డింగ్ మొత్తం పూర్తయ్యిందని , మాస్టర్ కాపీ నిర్మాతలకు అందజేశానని రెహమాన్ తెలిపారు.

మనోహరుడు సినిమాలో విక్రమ్ పదిహేనేళ్ల బాలుడిగానూ, 85యేళ్ల వృద్ధుడిగానూ కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తారు. సినిమాపై భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆర్ధిక సమస్యల కారణంగా సినిమా విడుదల వాయిదా పడిందని, శంకర్ రీ-షూట్ చేస్తున్నాడని ఇలా పలు పుకార్లు వినిపిస్తున్నాయి. రెహమాన్ ఆడియో రెడీ చేయడంతో త్వరలో ఆడియో, సినిమా విడుదల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.

Exit mobile version