
సినిమా అంటే ఎంటర్టైన్మెంట్.. కానీ అప్పుడప్పుడు కొన్ని మేసే సినిమాలు వస్తుంటాయి. అవి విజయాలు సాధించకపోయినా ఆ సినిమాలు మాత్రం ఎంతో మందిని ప్రభావితం చేస్తుంటాయి, అలాగే ఎంతో మందికి స్పూర్తిగా నిలిచి కొంతమంది లైఫ్ లని కూడా మార్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒక పాట, ఆ పాటలోని భావం స్పూర్తిగా నిలిచిన సందర్భాలు తక్కువగా ఉంటాయి. అలాంటి ఓ సంఘటనే రీసెంట్ గా ఎఆర్ రెహమాన్ లైఫ్ లో జరిగింది. షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన స్వదేశ్ సినిమా కోసం ఎఆర్ రెహమాన్ మనదేశ గొప్పతనం మరియు ఎంతో మందికి స్ఫూర్తి నిచ్చేలా కంపోజ్ చేసిన సాంగ్ ‘ఏ జో దేశ్ హై తేరా’.
ఈ సాంగ్ యంగ్ జెనరేషన్ లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కి ప్రిపేర్ అయ్యే ఉమేష్ ని ఇన్స్పైర్ చేసింది. దాంతోనే అతను సివిల్ సర్వీసెస్ లో 77వ రాంక్ సాధించాడు. ఎన్.ఎస్.కె ఉమేష్ మధురై ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి గ్రాడ్యువేట్ అయ్యాక సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యాడు. మొదటి రెండు అటెంప్ట్స్ లో మిస్ అయిన ఉమేష్ మూడో సారి 77వా రాంక్ తో సివిల్స్ కొట్టేసాడు. ఉమేష్ కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది మాత్రం ఎఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ‘ఏ జో దేశ్ హై తేరా’ పాటే అని, ఆ పాట వల్లే తను సివిల్స్ లో సీట్ కొట్టగలిగానని అంటున్నాడు. ఈ విషయం ఎఆర్ రెహమాన్ ఎంతో గర్వించదగ్గ విషయం.