‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ – సమంతకి తన గొంతు అరువు ఇవ్వడంతో బాగా ఫేమస్ అయిన సింగర్ చిన్మయిలు మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. వీరిద్దరి వివాహం మే 5వ తీదీ ఉదయం 10గంటలకు చెన్నైలో జరిగింది.
ఈ వివాహ మహోత్సవానికి రాహుల్ ఇండస్ట్రీలోని ప్రముఖులను ఆహ్వానించాడు. చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్న వీరిద్దరూ పెద్దల ఒప్పందంతో అందరి సమక్షంలో సాంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. ఈ నూతన జంటకి 123తెలుగు.కామ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.


