పెళ్లి చేసుకోబోతున్న స్టార్ కమెడియన్ !

పెళ్లి చేసుకోబోతున్న స్టార్ కమెడియన్ !

Published on Oct 23, 2018 1:59 PM IST


‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో తెలుగు తెరకు కమెడియన్ గా పరిచయం అయి.. తన కామెడీ టైమింగ్ తో, తన డైలాగ్‌ డెలివరీతో స్టార్‌ ఇమేజ్‌ సంపాదించుకున్నాడు కమెడియన్‌ రాహుల్ రామకృష్ణ. కాగా రాహుల్ రామకృష్ణ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. తన పెళ్లి గురించి రాహులే స్వయంగా సోషల్ మీడియాలో తనదైన శైలిలో ఫన్నీగా పోస్ట్ చేశాడు.

రాహుల్ రామకృష్ణ తన ట్వీటర్ పేజ్‌ లో.. తన పెళ్లి గురించి పోస్ట్ చేస్తూ.. ‘నేను జనవరి 15న పెళ్లి చేసుకోబోతున్నాను. సీరియస్ గా చెబుతున్నాను. దయచేసి నా పెళ్లి గురించి ఎవరికీ చెప్పకండి’ అని.. బీచ్‌లో తనకు కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశాడు రాహుల్‌. ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు రాహుల్‌ కు వరుసగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు