కొత్త సినిమా కోసం రెడీ అవుతున్న యంగ్ డైరెక్టర్ !

Published on Aug 20, 2019 3:00 am IST

తన మొదటి సినిమా ‘చి.ల.సౌ’తోనే మంచి హిట్ అందుకున్నాడు రాహుల్ ర‌వీంద్ర‌న్. తన రెండో చిత్రంగా కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా `మ‌న్మ‌థుడు 2`ను తెరకెక్కించాడు. రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ గా వచ్చిన ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది. అయితే ఈ చిత్రం ఫలితంతో సంబంధం లేకుండా రాహుల్ తన తదుపరి మూడో సినిమాని కూడా త్వరలో మొదలెట్టానున్నాడు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో భాగమైన ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్స్‌ లో రాహుల్ ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ చిత్రం యొక్క పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ ర‌వీంద్ర‌న్ ప్రస్తుతం డైరెక్టర్ గా బిజీ అవుతుండటం విశేషం. మరి రాహుల్ డైరెక్టర్ గానే కొనసాగుతాడా లేక మధ్యలో మళ్లీ మేకప్ వేసుకుంటూ.. ఇటు డైరెక్టర్ గా అటు ఆర్టిస్ట్ గా కొనసాగుతాడో చూడాలి.

సంబంధిత సమాచారం :