దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ను గెలుపొందిన ఈ చిత్రం ఆస్కార్స్ బరిలో ఒరిజినల్ సాంగ్ విభాగం లో ఎంపిక అయ్యింది. అయితే ఈ నాటు నాటు పాట వరల్డ్ వైడ్ గా సాలిడ్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది.
మార్చ్ 12 వ తేదీన 95 వ అకాడెమీ అవార్డ్స్ లో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఈ నాటు నాటు సాంగ్ ను లైవ్ గా పెర్ఫాం చేయనున్నారు. అయితే ఇది తన జీవితం లో మర్చిపోలేని మూమెంట్ అవుతుంది అంటూ రాహుల్ చెప్పుకొచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
This is going to be unforgettable moment in my life???????????? https://t.co/Me1sCKSMxY
— Rahul Sipligunj (@Rahulsipligunj) February 28, 2023


