రాహుల్, సుశాంత్ ల ‘చిలసౌ’ ఫస్ట్ లుక్ వివరాలు !

రాహుల్, సుశాంత్ ల ‘చిలసౌ’ ఫస్ట్ లుక్ వివరాలు !

Published on Mar 14, 2018 12:40 PM IST

భరత్ కుమార్ మలసాల, హరి పులిజలలు సంయుక్తంగా సిరుని సినిమా కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న సినిమా ‘చిలసౌ’. సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమాను హీరో రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేశాడు. రుహాని శర్మ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కానుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఈ నెల 18న ఉగాది సందర్భంగా విడుదల చేస్తున్నారు.

ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ప్రేమ కథగా రూపొందిన ఈ సినిమా చిత్రీకరణను తక్కువ రోజుల్లోనే పూర్తిచేశారు. సుశాంత్ కు ఈ సినిమా బ్రేక్ ఇస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఈ ఏడాది వేసవిలోనే సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

తాజా వార్తలు