తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించడంతో స్వతహాగా తమిళుడైన రాహుల్ రవీంద్రన్.. ఇక్కడే హీరోగా సెటిల్ అయిపోయాడు. ఎక్కువగా తెలుగు సినిమాలు చేస్తున్నాడు. ఏడాది గ్యాప్ తర్వాత ఓ తమిళ సినిమాలో నటించడానికి అంగీకరించాడు.
మహిళా దర్శకురాలు అంజనా అలీ ఖాన్ దర్శకత్వం వహించబోయే ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుంది. నాని హీరోగా వచ్చిన సెగ(తమిళంలో వేప్పం) సినిమా దర్శకురాలు ఈవిడే. ఈ సినిమాకు ‘పల్ అందు వాజహ్గా’ అనే టైటిల్ ఖరారు చేశారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.
తెలుగులో రాహుల్ రవీంద్రన్ నటించిన ‘అలా ఎలా..?’ ఈ నెల 28న విడుదలవుతుంది. సందీప్ కిషన్ తో కలసి నటిస్తున్న ‘టైగర్’ సెట్స్ పై ఉంది.


