స్టార్ రైటర్ ప్రజెంట్స్ లో రాబోతున్న చిన్న చిత్రం !

స్టార్ రైటర్ ప్రజెంట్స్ లో రాబోతున్న చిన్న చిత్రం !

Published on Aug 21, 2018 3:11 PM IST


స్టార్స్‌ కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కంపోజ్ చేసిన ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ కుమారుడు రాహుల్ విజ‌య్‌ హీరోగా ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి నాని వాయిస్ అందించగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రం ఆడియోను లాంచ్ చేసి ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను తీసుకువచ్చారు. అయితే ఈ చిత్రం ఆగష్టు 24 న విడుదల చేస్తున్నామని చిత్రబృందం గతంలో అధికారికంగా ప్రకటించింది. గత కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం కూడా చేసింది.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం వాయిదా పడింది. స్టార్ రైటర్ కోన వెంకట్ ప్రజెంట్స్ లో ఈ చిత్రం విడుదలవ్వబోతుందని త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. రాహుల్ సరసన కావ్యా థాప‌ర్ హీరోయిన్ గా నటిస్తోంది. వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌ పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కొత్త దర్శకుడు రాము కొప్పుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి దివ్య విజయ్‌ నిర్మాతగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు