కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో !

Published on Apr 14, 2019 1:40 pm IST

ఈమాయ పేరేమిటో తో హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ ఇటీవల ‘సూర్యకాంతం’ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు. అయితే ఈ రెండు చిత్రాలు కూడా ఈ యువ హీరో కి విజయాన్ని అందించలేకపోయాయి.

ఇక ఈ సినిమాల తరువాత రాహుల్ విజయ్ కన్నడ లో విజయం సాధించిన ‘కాలేజీ కుమార’ రీమేక్ లో నటించనున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళంలో రీమేక్ కానుంది. కాగా ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్ ఈ రోజు లాంచ్ అయ్యింది. హుషారు ఫేమ్ ప్రియా వడ్లమాని హీరోయిన్గా నటిస్తుండగా హీరోకి తల్లి తండ్రులుగా ప్రభు , మధుబాల కనిపించనున్నారు. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన హరీష్ సంతోష్ ఈ రీమేక్ ను తెరక్కించనున్నాడు. కాగా ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ లో హీరోకి తండ్రి గా ప్రముఖ హీరో శ్రీకాంత్ నటించనున్నారు.

సంబంధిత సమాచారం :