సాహోలో బాలీవుడ్ హాట్ బ్యూటీ రోల్ ఏమిటీ…?

Published on Aug 20, 2019 12:06 pm IST

సాహో టీం నిన్న ఎటుంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓ గ్లామరస్ సాంగ్ విడుదల చేసి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. బ్యాడ్ బాయ్ పేరుతో విడుదలైన ఆ సాంగ్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గర బికినీ బేబీస్ తో ఆడిపాడుతూ ప్రభాస్ నిజంగా బ్యాడ్ బాయ్ అనిపించాడు. సాంగ్ లో ప్రభాస్ సరసన చేసిన బాలీవుడ్ భామ జాక్విలిన్ పెర్నాండెజ్ అయితే సెక్సీ డ్రెస్సులలో, మత్తెక్కించే స్టెప్స్ తో అలరించింది.

ఐతే సాహోలో జాక్విలిన్ రోల్ ఏమిటనేది ఇప్పుడు అందరి మదిలో మెదలాడుతున్న ప్రశ్న. ఎందుకంటే ఈ శ్రీలంక బ్యూటీ సాహో సినిమాలో నటిస్తుందని గాని, లేదా ఒక పాటలో కనిపిస్తుందని కానీ చిత్ర యూనిట్ అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. ఎవ్లీన్ శర్మ ఓ పాటలో నటించారని వార్తలు రావడం జరిగింది. మరి ఈ మూవీలో జాక్విలిన్ కేవలం ఒక పాటలో కనిపిస్తుందా లేక ఆమెకు కేవలం కొద్ది నిమిషాల నిడివిగల కీలక పాత్రలో కనిపిస్తుందా అనేది ఆసక్తికరం. బ్యాడ్ బాయ్ సాంగ్ దృష్ట్యా ఈమె ఓ మాఫియా డాన్ దగ్గర ఉండే ఓ బ్యూటిఫుల్ లేడీ ఏమో అని అనుమానం కలుగుతుంది. మరి చూడాలి దర్శకుడు సుజీత్ ఆమెను పాత్రను సాహోలో ఎలా చూపించనున్నాడో.

సంబంధిత సమాచారం :