ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) కొత్త కమిటీ ప్రకటన

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) కొత్త కమిటీ ప్రకటన

Published on Jun 1, 2026 8:00 AM IST

Raj-Allada

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) 2026-2028 సంవత్సరాలకు గాను తన నూతన కార్యవర్గాన్ని (ఎగ్జిక్యూటివ్ కమిటీ) ప్రకటించింది. సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నూతన అధ్యక్షుడిగా రాజ్ అల్లాడాను ఎంపిక చేశారు. న్యూజెర్సీకి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ అయిన రాజ్ అల్లాడ, 2009 నుండి నాట్స్‌లో వాలంటీర్‌గా, బోర్డు మెంబర్‌గా వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారు. 2023లో న్యూజెర్సీలో జరిగిన నాట్స్ సంబరాల్లో ఈయన డిప్యూటీ కన్వీనర్‌గా వ్యవహరించారు.

​ఈ నూతన కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్ (ప్రోగ్రామ్స్)గా రాజేష్ కండ్రు, వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్)గా అనుదీప్ అర్లా, వైస్ ప్రెసిడెంట్ (సర్వీసెస్)గా రాజ్యలక్ష్మి చిలుకూరి ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శిగా సుధీర్ మిక్కిలినేని, ఖజాంచీగా రామ్ నరేష్ కొమ్మనబోయిన, జాయింట్ సెక్రటరీగా భాను లంక, జాయింట్ ట్రెజరర్‌గా వెంకట సాకమూరి బాధ్యతలు చేపట్టనున్నారు.

​ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ కమిటీని ఎంపిక చేసినట్లు నాట్స్ బోర్డ్ ఛైర్మన్ కిషోర్ కంచర్ల తెలిపారు. రాజ్ అల్లాడ నాయకత్వంలోని నూతన బృందం రాబోయే రెండేళ్లలో సంస్థ సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తూ బోర్డు సభ్యులు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

తాజా వార్తలు