’భద్రం బి కేర్‌ఫుల్’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ దాసిరెడ్డి, ఇటీవల హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్రాండ్ ‘లూయిస్ వ్యూట్టన్’ స్టోర్‌ను సందర్శించారు. ఈ లగ్జరీ స్టోర్‌లో అందుబాటులో ఉన్న హ్యాండ్‌బ్యాగ్స్, షూస్, జ్యువెలరీ వంటి ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. సుమారు 172 ఏళ్ల నేపథ్యం ఉన్న ఈ అంతర్జాతీయ బ్రాండ్ స్టోర్‌కు రావడం పట్ల రాజ్ దాసిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, రాజ్ దాసిరెడ్డి తన తదుపరి సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. ఆయన నటించబోయే కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను చిత్ర బృందం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


