ఒకే సినిమాతో తమ కుమారులను హీరోలుగా పరిచయం చేస్తున్న ప్రముఖ నిర్మాతలు !

raj kandhukuri

పెళ్లి చూపులు’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఓ స్థానం కల్పించుకున్నారు రాజ్ కందుకూరి. ఇప్పుడు ఆయన తనయుడు శివ కందుకూరి కూడా హీరోగా పరిచయం అవ్వబోతున్నారు. అలాగే మరో ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ కూడా హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. అయితే ఈ ఇద్దరి నిర్మాతలు తమ కుమారులను ఒకే సినిమాతో హీరోలుగా పరిచయం చేస్తున్నారని ఫిల్మ్ నగర్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

వివరాల్లోకి వెళ్తే కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా వచ్చిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమా గుర్తుందిగా. ఆ సినిమా డైరెక్టర్ శివ‌రాజ్ క‌నుమూరి చెప్పిన కథ ఈ ఇద్దరి నిర్మాతలకు బాగా నచ్చిందట. అయితే ఈ కథలో ఇద్దరు హీరోలు ఉంటారట. దాంతో విక్రమ్ ను. శివను హీరోలుగా పెట్టి ఈ సినిమా తీయనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

Exit mobile version