రాజ్ తరుణ్ ఆశలన్నీ ‘లవర్’ మీదే !

రాజ్ తరుణ్ ఆశలన్నీ ‘లవర్’ మీదే !

Published on Jun 25, 2018 8:15 PM IST

Raj Tarun all hopes on ‘lover’ !
యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, ‘అలా ఎలా’ చిత్రంతో పరిచయమైన యువ దర్శకుడు అన్నీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవర్’. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన రిద్ధి కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం వరుస పరాజయాలతో గత కొంతకాలంగా ఇబ్బందిపడుతున్న రాజ్ తరుణ్ కెరీర్ కి ఈ ‘లవర్’ చిత్రం చాలా కీలకం కానుంది. ఇటీవల రాజ్ తరుణ్ చేసిన సినిమాలేవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. చివరిగా వచ్చిన ‘రాజుగాడు’ కూడ భారీ పరాజయాన్నే మిగిల్చింది.

ఈ పరిస్థితుల మధ్య రాజ్ తరుణ్ నటించిన లవర్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పుడు ఈ యంగ్ హీరో తన ఆశలన్నీ ఈ చిత్రం మీదే పెట్టుకున్నాడు. మరి రాజ్ తరుణ్ ఆశల్ని ఈ చిత్రం నెరవేరుస్తుందో లేదో చూడాలి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమక్షంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఫై హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు