మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో వస్తున్న రాజ్ తరుణ్.!

Published on Mar 24, 2021 2:00 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ “ఒరేయ్ బుజ్జిగా”తో ఓటిటిలో అయినా మంచి హిట్ కొట్టాడు అనుకుంటే మళ్ళీ “పవర్ ప్లే” సినిమాతో వెనకబడ్డాడు. దీనితో సిల్వర్ స్క్రీన్ పై మంచి కం బ్యాక్ కోసం చూస్తున్నాడు. మరి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో రానున్నాడు.

నూతన దర్శకుడ మోహన్ వీరంకి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి “స్టాండప్ రాహుల్” అనే యూత్ ఫుల్ టైటిల్ ను పెట్టడమే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ విడుదల చేసారు.మరి ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ రాజ్ తరుణ్ సరసన నటిస్తుంది.

ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ కామెడీ లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తుండగా డ్రీం టౌన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. మరి ఈ చిత్రంతో అయినా రాజ్ తరుణ్ మంచి కం బ్యాక్ అందుకుంటాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :