రాజ్‌ తరుణ్‌ హీరోగా కె.కె. రాధామోహన్‌ కొత్త చిత్రం !

రాజ్‌ తరుణ్‌ హీరోగా కె.కె. రాధామోహన్‌ కొత్త చిత్రం !

Published on Jun 19, 2019 9:03 PM IST

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా హిట్‌ చిత్రాల నిర్మాత కె.కె. రాధామోహన్‌ శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై యువ దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘ప్రొడక్షన్‌ నెం.8′ పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో జూన్‌ 19 ఉదయం 8.30 గంటలకు జరిగాయి.

ఈ సందర్భంగా నిర్మాత కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ – ”అధినేత’. ‘ఏమైంది ఈవేళ’. ‘బెంగాల్‌ టైగర్‌’, ‘పంతం’ వంటి మంచి హిట్‌ చిత్రాల తర్వాత మా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌లో చేస్తున్న మరో మంచి కథా చిత్రం ఇది. రాజ్‌ తరుణ్‌, కొండా విజయ్‌కుమార్‌ కాంబినేషన్‌లో ఇది మా బేనర్‌ కి మరో సూపర్‌ హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.

రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌ నుండి నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఫొటోగ్రఫీ: ఆండ్రూస్‌, మాటలు: నంద్యాల రవి, నిర్మాత: కె.కె. రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు