ప్రమాదానికి కారణం…,తరుణ్ మాటల్లో…!

Published on Aug 21, 2019 11:54 am IST

హీరో రాజ్ తరుణ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఓ మూవీ షూటింగ్ లో పాల్గొని వస్తున్న రాజ్ తరుణ్ కారు నగర శివారులో ఓ మలుపు వద్ద ఓ గోడను ఢీకొట్టడంతో ఈఘటన జరిగింది. ఐతే ప్రమాదం జరిగిన తరువాత రాజ్ తరుణ్ మొదటిసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ప్రమాదం పై వస్తున్న అనేక పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.

“నా క్షేమం తెలుసుకోవడానికి కాల్స్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తరచుగా ప్రమాదాలు జరిగే ఆ ప్రదేశంలో హఠాత్తుగా వచ్చిన మలుపు గమనించక పోవడం వలన నా కార్ పెద్ద శబ్దంతో ఓ గోడను ఢీకొనడం జరిగింది. ఆ హఠాత్ పరిణామంతో షాక్ కి గురైన నేను, తేరుకొని పరుగున నార్సింగ్ సర్కిల్ నుండి ఇంటికి చేరాను” అని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :