రవిబాబు దర్శకత్వంలో రాజ్ తరుణ్ ?
Published on Feb 19, 2018 10:51 am IST

రాజ్ తరుణ్ నటించిన రంగుల రాట్నం సినిమా ఇటీవల విడుదలైంది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాజుగాడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత రవిబాబు తో రాజ్ తరుణ్ సినిమా ఉండబోతోందని సమాచారం. స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించబోతున్నారని సమాచారం.

రవిబాబు ప్రస్తుతం అదుగో సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రం తరువాత రవిబాబు, రాజ్ తరుణ్ సినిమా మొదలు కాబోతోందని సమాచారం. ఈ సినిమాతో పాటు రాజ్ తరుణ్ మరో రెండు సినిమాలకు కమిట్ అయినట్లు తెలుస్తోంది.

 
Like us on Facebook