‘పెళ్ళైంది కాని నో కహాని’ పోస్టర్ విడుదల చేసిన రాజ్ తరుణ్

‘పెళ్ళైంది కాని నో కహాని’ పోస్టర్ విడుదల చేసిన రాజ్ తరుణ్

Published on Jun 2, 2026 9:00 PM IST

శ్రీహరి, స్మిత జంటగా నటిస్తున్న “పెళ్ళైంది కాని NO కహాని” సినిమా పోస్టర్‌ను నటుడు రాజ్ తరుణ్ చేతులమీదుగా విడుదల చేశారు. మై3 సినిమాస్ బ్యానర్‌పై ఏడుకొండలు తాడిశెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చిత్ర బృందం తెలిపింది.

ఈ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాలకు ఆదరణ బాగుందని, ఈ సినిమా కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని హీరో శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. కంటెంట్ మీద నమ్మకంతో వస్తున్నామని నటుడు జగన్మోహన్ రావు తెలిపారు.

సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని దర్శకుడు ఏడుకొండలు తెలిపారు. త్వరలోనే సెన్సార్ పనులు పూర్తి చేసి, వచ్చే నెలలో సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు