కారు ప్రమాదానికి గురైన హీరో రాజ్ తరుణ్

Published on Aug 21, 2019 7:02 am IST

యంగ్ హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 19, అర్థరాత్రి ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది.నగర శివారులో ఓ మలుపు దగ్గర నేరుగా దూసుకెళ్లిన కారు ఒక గోడను గుద్ది ఆగిపోయింది.ఐతే రాజ్ తరుణ్ కి ఎటువంటి గాయాలు కాకపోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మొదట హీరో తరుణ్ అని భావించినా, అది నేను కాదని తరుణ్ స్పష్టత ఇవ్వడంతో రాజ్ తరుణ్ అని తేలింది.ఐతే ప్రమాదానికి గల కారణాలు మాత్రం బయటకి రాలేదు. ప్రమాద సమయంలో రాజ్ తరుణ్ తో పాటు ఓ నిర్మాత ఉన్నాడని తెలుస్తుంది. అనూహ్యంగా సంఘటన అనంతరం రాజ్ తరుణ్ అక్కడి నుండి పారిపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. ఈ విజువల్స్ అక్కడున్న సిసి కెమెరాలలో రికార్డు అయ్యాయి.

ఈ మధ్య విజయాల పరంగా వెనుకబడిన రాజ్ తరుణ్, గుండెజారి గల్లంతయ్యిందే ఫేమ్ కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో చిత్రం చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :