‘నిత్యామీన‌న్’తో రాజ్ తరుణ్ లవ్ స్టోరీ అంటా ?

Published on May 8, 2019 7:14 pm IST

‘గుండె జారి గ‌ల్లంత‌య్యిందే’ లాంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు కొండా విజయ్ కుమార్. అయితే ఆ సక్సెస్ ను మాత్రం అలాగే కొనసాగించలేకపోయాడు. నాగచైతన్య పిలిచి మరి ఆఫర్ ఇచ్చినా.. ‘ఒక లైలా కోసం’ అంటూ ప్లాప్ చిత్రాన్ని తీశాడు. దాంతో మొదటి సినిమాకు వచ్చిన పేరు కాస్త పోయింది. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా మొత్తానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు విజ‌య్కుమార్ కొండా.

ఎట్టకేలకూ ఓ సినిమాను త్వరలో పట్టాలెక్కించనున్నాడు. అయితే ఇందులో హీరోయిన్‌గా నిత్యామీన‌న్ నటిస్తుంటే.. హీరోగా రాజ్ తరుణ్ నటిస్తున్నాడట. తన కన్నా వయసులో పెద్దదైన ఓ అమ్మాయిని ఇష్టపడే అబ్బాయి కథే ఈ సినిమా కథని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను కె.కె.రాధామోహన్ నిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

సంబంధిత సమాచారం :

More