రీమేక్ సినిమా చేయడంలేదంటున్న యువ హీరో !
Published on Jun 14, 2018 1:28 pm IST

ఈ ఏడాది ‘రంగుల రాట్నం, రాజుగాడు’ వంటి సినిమాలతో ప్రేలక్షకుల్ని పలకరించిన యువ హీరో రాజ్ తరుణ్ త్వరలో ఒక తమిళంలో నయనతార, విజయ్ సేతుపతిలు నటించిన ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారనే టాక్ వినబడింది. అంతేగాక ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని, హెబ్బా పటేల్ ఇందులో హీరోయిన్ అని అన్నారు.

కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తాను ఆ సినిమాను రీమేక్ చేయడంలేదని అన్నారు రాజ్ తరుణ్. అంతేగాక తన తర్వాతి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, ఇంకా నటీనటులు కూడ కన్ఫర్మ్ కాలేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో గత 10 రోజులుగా వస్తున్న వార్తలకు చెక్ పడినట్లైంది.

 
Like us on Facebook