తనపై లావణ్య కేసు పెట్టడం పట్ల రాజ్ తరుణ్ రియాక్షన్ ఇదే!

తనపై లావణ్య కేసు పెట్టడం పట్ల రాజ్ తరుణ్ రియాక్షన్ ఇదే!

Published on Jul 5, 2024 6:28 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ చివరిసారిగా నా సామిరంగ చిత్రంలో కనిపించారు. ఈ హీరో ప్రస్తుతం తిరగబడర సామీ, భలే ఉన్నాడే, పురుషోత్తముడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే నేడు సడెన్ గా ఒక వార్త తో సోషల్ మీడియాలో హాయ్ టాపిక్ గా మారిపోయాడు. తనను మోసం చేశాడు అంటూ లావణ్య అనే యువతి హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. 2012 నుండి రాజ్ తరుణ్ తో రిలేషన్ లో ఉన్నట్లు యువతి పేర్కొంది. అయితే ఇటీవల ఒక హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాక తనకి సంబంధం లేని కేసులో ఇరికించడం వలన 43 రోజులు జైల్లో ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో హీరో రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి పలు వ్యాఖ్యలు చేశారు.

మేం రిలేషన్ షిప్ లో ఉన్నాం అనేది నిజమే. 2014 నుండి 2017 వరకు కలసి ఉన్నాం. అయితే ఆమె ఫ్రెండ్స్ సర్కిల్ మరియు డ్రగ్స్ తీసుకోవడం వంటివి చూసి తట్టుకోలేక పోయా. వదిలేసి వెళ్దాం అనుకుంటే మీడియా ముందుకు వెళ్తా అని బెదిరించేది. పరువు కోసం భరిస్తూ వచ్చా. ఆమె మరొకరితో రిలేషన్ కొనసాగించింది. రోజూ కొడుతున్నాడు అంటూ ఆ వ్యక్తి పై కూడా కేసు పెట్టింది అంటూ చెప్పుకొచ్చారు రాజ్ తరుణ్. అయితే తనను టార్చర్ పెట్టింది అని, లీగల్ గా ఫైట్ చేస్తా అని చెప్పుకొచ్చారు రాజ్ తరుణ్. అంతేకాక మీ అందరి సపోర్ట్ కావాలి అని కోరారు. రాజ్ తరుణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ హీరో సోలో హిట్ చూసి చాలా కాలం అయింది. ప్రస్తుతం ఉన్న చిత్రాల పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు