సెన్సార్ పూర్తి చేసుకొని రెడీ అవుతున్న రాజ్ తరుణ్ “పవర్ ప్లే”.!

Published on Feb 25, 2021 2:00 pm IST

మన టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఆనతి కాలంలోనే హిట్ కొట్టి అదే పరంపర కొనసాగించడం అందరి యువ హీరోలకు సాధ్యపడే విషయం కాదు కానీ దానిని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ సొంతం చేసుకున్నాడు. అయితే స్టార్టింగ్ లో మంచి హిట్స్ అనుకున్న ఈ యువ హీరో మెల్లగా ప్లాప్ ల బారిన పడ్డాడు. లేటెస్ట్ గా ఓటిటిలో “ఒరేయ్ బుజ్జిగా”తో పర్వాలేదనిపించి థియేట్రికల్ గా కూడా ఓకే అనిపించాడు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా మళ్ళీ తన అదృష్టం పరీక్షించుకోడానికి వస్తున్నాడు.

అదే ఒరేయ్ బుజ్జిగా దర్శకుడు విజయ్ కుమార్ కొండా తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ “పవర్ ప్లే”. మంచి ప్రమోషన్స్ తో బజ్ ను సంతరించుకున్న ఈ చిత్రం లేటెస్ట్ గా సెన్సార్ ను పూర్తి చేసుకుని అనుకున్న సమయానికే ఈ మార్చ్ 5న రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. యూ/ఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రంలో నటి పూర్ణ కీలక పాత్రలో నటించింది. అలాగే ఈ రోల్ పట్లనే మేకర్స్ చాలా నమ్మకంగా కూడా ఉన్నారు. ఇక ఈ ఆసక్తికర చిత్రంను వనమాలీ క్రియేషన్స్ వారు వహించారు.

సంబంధిత సమాచారం :