వరల్డ్ వైడ్ గా మార్చి 5కి రెడీగా ఉన్న రాజ్ త‌రుణ్ “పవర్ ప్లే”

వరల్డ్ వైడ్ గా మార్చి 5కి రెడీగా ఉన్న రాజ్ త‌రుణ్ “పవర్ ప్లే”

Published on Feb 23, 2021 1:31 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల‌ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మార్చి 5న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ మూవీని యూఎస్ఎ లో గ్రేట్ ఇండియా ఫిలింస్ రిలీజ్ చేస్తుండ‌గా ఆస్ట్రేలియాలో స‌థ‌ర‌న్ స్టార్ ఇంట‌ర్‌నేషన‌‌ల్‌, మిడిల్ ఈస్ట్‌లో మ‌ను రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఈ సంద‌ర్భంగా..చిత్ర నిర్మాతల్లో ఒకరైన దేవేష్ మాట్లాడుతూ – “రాజ్ త‌రుణ్‌, కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో డిఫ‌రెంట్ జోన‌ర్‌లో వ‌స్తోన్న చిత్ర‌మిది. మార్చి 5న వ‌రల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ‌లో వరంగల్ శ్రీను ‘కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్’ ద్వారా గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. అలాగే యూఎస్ఎ లో గ్రేట్ ఇండియా ఫిలింస్, ఆస్ట్రేలియాలో స‌థ‌ర‌న్ స్టార్ ఇంట‌ర్‌నేషన‌‌ల్‌, మిడిల్ ఈస్ట్‌లో మ‌ను రిలీజ్ చేస్తున్నారు. అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ మూవీ త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తుంది” అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి మాట్లాడుతూ – “పోస్ట్ ప్రొడక్షన్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 5 న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల‌వుతున్న `ప‌వ‌ర్‌ ప్లే` త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది” అని అన్నారు.ఇక ఈ చిత్రంలో పూర్ణ ప్రతినాయక పాత్రలో నటిస్తుండగా, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌, కేద‌రి శంక‌ర్‌, టిల్లు వేణు, భూపాల్‌, అప్పాజీ, ర‌వివ‌ర్మ‌, సంధ్య‌ జ‌న‌క్ త‌దిత‌రులు నటించారు.

ఇక ఈ చిత్రానికి క‌థ‌-మాట‌లు: న‌ంధ్యాల ర‌వి, సినిమాటోగ్ర‌ఫి: ఐ. ఆండ్రూ, సంగీతం: సురేష్ బొబ్బిలి‌, ఎడిటింగ్: ప‌్ర‌వీణ్ పూడి, ఆర్ట్‌: శివ‌, ఫైట్స్‌: `రియ‌ల్` స‌తీష్‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బి.వి సుబ్బారావు, కో- డైరెక్ట‌ర్: వేణు కురపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి, స‌మ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి ప‌ద్మ‌, నిర్మాత‌లు: మ‌హిద‌ర్‌, దేవేష్‌,
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ కుమార్ కొండా లు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు