యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచిన క్లీన్ ఎంటర్‌టైనర్ ‘సినిమా చూపిస్త మావ’ మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలవడంతో పాటు ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.
ఈ క్రేజీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను జూన్ 27న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాజ్ తరుణ్ మార్క్ ఎనర్జీ, రావు రమేష్‌తో ఆయన కెమిస్ట్రీ, మరియు అదిరిపోయే కామెడీ టైమింగ్ ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతారని మేకర్స్ నమ్ముతున్నారు.
నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్‌గా నటించగా, శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న తరుణంలో, ఈ మోస్ట్ లవ్డ్ ఎంటర్‌టైనర్ జూన్ 27న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.


