కుమారి 21ఎఫ్ సినిమాతో మంచి విజయం సాధించిన రాజ్ తరుణ్ మళ్ళి ఆ సినిమా దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎస్.ఆర్.టి బ్యానర్ పై ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మించబోతున్నారు. వచ్చే నెల 18న ఈ సినిమా ప్రారంభం కానుంది.
తాజా సమాచారం మేరకు నందిత శ్వేతా ఈ సినిమాలో నటించబోతుంది తెలుస్తోంది. ఫఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర కాబట్టి నందిత శ్వేతా ను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. మే 11 న రాజ్ తరుణ్ నటించిన రాజుగారు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


