హిట్టిచ్చిన దర్శకుడితో మరో సినిమా చేయనున్న రాజ్ తరుణ్ !


యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్లోని హిట్ సినిమాల్లో ‘కుమారి 21 ఎఫ్’ కూడ ఒకటి. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ దర్శకుడితోనే మరో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు రాజ్ తరుణ్. ఈ చిత్రాన్ని ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు.

తాజా సమాచారం మేరకు ఈ చిత్రం ఏప్రిల్ 18 న లంచ్ కానుంది. ఈ చిత్రం పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా ఉంటుందట. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటులెవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇకపోతే రాజ్ తరుణ్ నటించిన ‘రాజుగాడు’ చిత్రం ఈ మే 11న విడుదలకానుంది.