‘ఒరేయ్.. బుజ్జిగా’ షూటింగ్ మొదలెట్టారు !

‘ఒరేయ్.. బుజ్జిగా’ షూటింగ్ మొదలెట్టారు !

Published on Sep 10, 2019 10:54 AM IST

‘గుండె జారి గ‌ల్లంత‌య్యిందే’ లాంటి ఫుల్ ఎంటర్ టైనర్ తో హిట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు కొండా విజయ్ కుమార్. అయితే ఆ సక్సెస్ ను మాత్రం అలాగే కొనసాగించలేకపోయాడు. మళ్లీ చాలా గ్యాప్ తరువాత ఎట్టకేలకూ రాజ్‌ తరుణ్‌ హీరోగా కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘ఒరేయ్.. బుజ్జిగా’ అనే ఆసక్తికర టైటిల్‌ను నిర్ణయించినట్టుగా తెలిపారు. ఈ రోజు నుండి నాన్ స్టాప్‌గా షూటింగ్ జరుగుతుంది.

కాగా ఈ సినిమాలో హీరో రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా వాణి విశ్వనాధ్, నరేష్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా కథ వెరీ ఇంట్రస్టింగ్ ప్లే తో సాగుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా లవ్ స్టోరీలో ఫుల్ ఫన్ తో ఉంటుందట. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు