తమిళ రీమేక్ లో నటించనున్న రాజ్ తరుణ్ !
Published on Jun 3, 2018 11:48 am IST

వరుస పరాజయాలతో ఉన్న హీరో రాజ్ తరుణ్ మొన్న రాజుగాడు గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . ఈ సినిమా కూడా మిక్సడ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు తమిళ రీమేక్ ను నమ్ముకున్నాడు .

విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి , నయన తార జంటగా తమిళ్ లో సూపర్ హిట్ సాధించిన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారు.ఈ సినిమాలో రాజ్ తరుణ్ నటించనున్నాడు. ఈ సినిమా ‘నేను రౌడీ నే’ పేరుతో తెలుగులోనూ విడుదలైంది.

నిర్మాత సి . కళ్యాణ్ ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులని సొంతం చేసుకున్నారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను తొందర్లోనే ప్రకటించనున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook