దిల్ రాజుకు రాజ్ తరుణ్ విన్నపం !

దిల్ రాజుకు రాజ్ తరుణ్ విన్నపం !

Published on Jun 24, 2018 8:32 PM IST

యువ హీరో రాజ్ తరుణ్ ,రిద్ధి కుమార్ జంటగా ‘ఆలా ఎలా’ ఫెమ్ అన్నీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవర్ ప్రముఖ బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ఫై దిల్ రాజు సమక్షంలో హర్షిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇక తాజాగా జరిగిన ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకలో రాజ్ తరుణ్ మాట్లాడుతూ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారి ధన్యవాదాలు అయన సంవత్సరానికి నాతో ఒక సినిమా చేస్తాను అంటే వేరే సినిమాలకు సైన్ చేయనని ఆయనకు సరదాగా విన్నవించారు అలాగే ఈ చిత్రం ఇంత బాగా రావడానికి కారణం అయినా ప్రతి ఒక్క టెక్నిషియన్ కి ఈ సందర్బంగా రాజ్ ధన్యవాదాలు తెలియజేశారు.

ఇక వరుస పరాజయాలతో కొనసాగుతున్న రాజ్ తరుణ్ ఈ సినిమా ఫై చాలా ఆశలు పెట్టుకున్నాడుఈ చిత్రం ఎలాగైనా విజయాన్ని అందిస్తుందని గట్టి నమ్మకంతో వున్నాడు. సమీర్ రెడ్డి చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం జులై రెండవ వారం లో విడుదలయ్యే అవకాశాలు వున్నాయి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు