గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘అవతార్-3’ డిసెంబర్ 19న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. జేమ్స్ కామెరూన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఓ విషయంలో మాత్రం ‘అవతార్-3’ని దాటేశాడు మన ‘రాజాసాబ్’.
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఓవర్సీస్ మార్కెట్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో రాజాసాబ్ టికెట్ ధర కనిష్టంగా 25 డాలర్లుగా ఉంది. అయితే, అదే అమెరికాలో ‘అవతార్ 3’ మూవీ ఐమాక్స్, 3డి టికెట్ రేటు 20 డాలర్లుగా ఉండటం గమనార్హం.
ఇలా ‘అవతార్-3’ ని మించిన రేట్లతో రాజాసాబ్ ఓవర్సీస్ ప్రేక్షకులకు ఎలాంటి ట్రీట్ ఇస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.