వెపన్స్ డిజైనింగ్ లో బిజీగా ఉన్న రాజమౌళి

వెపన్స్ డిజైనింగ్ లో బిజీగా ఉన్న రాజమౌళి

Published on Mar 20, 2013 8:15 AM IST

rajamouli-latest
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి కొన్ని విషయాలకు ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటారు, ముఖ్యంగా – ఇంటర్వల్ ఎపిసోడ్ తో ఆడియన్స్ ని పీక్స్ కి తీసుకెల్తారు, అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్,థ్రిల్లింగ్ గా ఉండే యాక్షన్ సీక్వెన్స్ లు వాటికి తగ్గా ఆయుధాల డిజైన్స్ చెయడంలో ఆయనకి ఓ ప్రత్యేకత ఉంది. ‘సిం హాద్రి ‘ సినిమా నుంచి రాజమౌళి సినిమాకి తగ్గట్టు హీరోకి తగ్గట్టు ఒక్కొ సరికొత్త ఆయుధంతో మన ముందుకు వచ్చారు.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం తన రాబొయే సినిమా ‘బాహుబలి ‘ కోసం ఆయుధాల డిజైనింగ్ లో బిజీగా ఉన్నారు. పీరియాడికల్ అడ్వెంచర్ డ్రామాగా ఈ సినిమాలో సరికొత్త గా డిజైన్ చెయబడ్డ కత్తులు,బాకులు మొదలైన ఆయుధాలను ఉపయొగించే అవకాశం ఉంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా , అనుష్క ఈ సినిమా షూటింగ్ కోసం సిద్దమవుతున్నారు. ఈ సినిమా కొసం వారికి కత్తి ఫైట్స్, గుర్రపు స్వారీ విషయల్లో శిక్షణ తీసుకున్నారు. ఆర్కా మీడియా బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం కీరవాణీ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు