“RRR” కోసం ప్లాన్ మార్చిన రాజమౌళి.?

“RRR” కోసం ప్లాన్ మార్చిన రాజమౌళి.?

Published on May 28, 2020 8:18 PM IST

దాదాపు ఆరేళ్ళ సుదీర్ఘ యాగం బాహుబలి అనంతరం దర్శకధీరుడు రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు మాస్ హీరోలతో “రౌద్రం రణం రుధిరం” అనే మరి భారీ పీరియాడిక్ వండర్ కు శ్రీకారం చుట్టారు. దీనితో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఎప్పుడో మొదలు కాబడిన ఈ చిత్రం లాక్ డౌన్ మూలంగా కొన్నాళ్ల పాటు షూటింగ్ వాయిదా పడాల్సిన వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు రాజమౌళి చిత్ర యూనిట్ తో కలిసి ప్లాన్ లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చెయ్యాలనే యోచనలో ఉన్నారట. ఇందుకు కారణం కూడా వేరే ఉంది.

సంక్రాంతి రేస్ లో ఈ చిత్రాన్ని నిలుపుతామని ముందు ప్రకటించారు. అందుకే అనుకున్న సమయానికే తీసుకురావాలని కథలో అక్కడక్కడా మార్పులు చేసి సాధ్యమైనంత వరకు అనుకున్న సమయానికే సినిమాను తీసుకురావాలనే ఆలోచనలో జక్కన్న ఉన్నారని మరో వెర్షన్ వినిపిస్తుంది. మరి రాజమౌళి ఏం ప్లానింగ్ లో ఉన్నారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు