
ఈ ఏడాది తెలుగు సినిమా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన సినిమా ‘బాహుబలి’. తెలుగు తెరపై మునుపెన్నడూ చూడని భారీ సెట్టింగ్స్ తో, సూపర్బ్ గ్రాఫిక్స్ తో వచ్చిన ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా కలెక్షన్స్ ని కొల్లగొట్టి టాలీవుడ్ టాప్ గ్రాసర్ స్థానాన్ని దక్కించుకుంది. ఈ టోటల్ క్రెడిట్ ఎస్ఎస్ రాజమౌళికె చెందుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొదటి పార్ట్ తర్వాత అందరూ సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి తరుణంలో బాహుబలి పార్ట్ 2 తో ఎండ్ కాదు పార్ట్ 3 కూడా ఉంటుందనే వారాలు వచ్చాయి. దాంతో ప్రేక్షకులలో అంటే రెండవ పార్ట్ లో కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చూపించడా అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ అనుమానాలను క్లియర్ చేసాడు రాజమౌళి. ‘బాహుబలి అనే సినిమా కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించాం. దాన్ని కేవలం రెండు పార్ట్స్ తో ముగించేయాలి అని అనుకోవడం లేదు. బాహుబలి ది బిగెనింగ్ అనే సినిమాకి బాహుబలి – ది కంక్లూజన్ అనేది పర్ఫెక్ట్ ఎండింగ్. మేము కథని కూడా అక్కడి వరకే ప్రిపేర్ చేసాం. కానీ బాహుబలి 3 అనేది కూడా కచ్చితంగా ఉంటుంది. కానీ ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకు మునుపెన్నడూ ఫీల్ అవ్వని అనుభూతిని ఇస్తుందని.. దాని గురించి ఇప్పుడే పూర్తిగా చెప్పలేనని’ అన్నాడు. దీంతో బాహుబలి 2 తర్వాత బాహుబలి 3 కూడా ఉంటుందని ఖరారు చేసాడు రాజమౌళి

