సూపర్ సక్సెఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ ‘బాహుబలి’ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి ఆయన తదుపరి సినిమా మహా భారతం మీద ఉంటుందని, అది కూడా కన్నడ నవల అయిన ‘పర్వ’ ఆధారంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకి రాజమౌళి స్వస్తి చెప్పాడు.
‘ప్రసతుతం మీడియాలో కన్నడ నవల ఆధారంగా ఓ సినిమా చేయనున్నాను అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతానికి బాహుబలి తర్వాత ఏం సినిమా చేయాలనేది ఇంకా ప్లాన్ చేయలేదని’ రాజమౌళి ట్వీట్ చేసాడు. బాహుబలి షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ హంక్ రానా అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ మూవీలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ ని 2015 ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు.


