సూర్యతో సినిమా పై రాజమౌళి స్పందన ఇదే !

సూర్యతో సినిమా పై రాజమౌళి స్పందన ఇదే !

Published on Sep 28, 2026 10:00 AM IST

రాజమౌళి – సూర్య కలయికలో ఓ సినిమా వస్తే బాగుంటుందని సూర్య అభిమానుల్లో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. చెన్నైలో జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా కార్యక్రమంలో రాజమౌళి ఈ విషయంపై స్పందించారు. సూర్యతో కలిసి పనిచేయడం గురించి అడిగినప్పుడు, ఆ ప్రశ్న వస్తుందని తనకు ముందే తెలుసని రాజమౌళి అన్నారు. అయితే, ఈ సినిమాకి సంబంధించిన వివరాలను వెల్లడించడానికి రాజమౌళి నిరాకరించారు. ఎందుకంటే, తమ కలయిక గురించి ఏదైనా పెద్ద అప్‌ డేట్ వస్తే అది వెంటనే వైరల్ అయ్యి, ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా పై ఎఫెక్ట్ పడుతుందని రాజమౌళి తెలిపారు.

అయినప్పటికీ, భవిష్యత్తులో తాను, సూర్య కలిసి పనిచేస్తే అది ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన చిత్రంగా ఉంటుందని చెప్పి రాజమౌళి ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తించారు. ముందు వరుసలో కూర్చున్న సూర్య, రాజమౌళి సమాధానం విని నవ్వుతూ, ఆయన మాటలతో ఏకీభవిస్తున్నట్లు ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. మొత్తానికి ఈ సంభాషణ మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు