తన సినిమాకు తానే గెస్ట్‌గా వెళుతున్న రాజమౌళి..!

Published on Jul 15, 2021 2:42 am IST

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ రీమేక్ సెట్స్‌పైకి వెళ్ళాల్సి ఉన్నా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది కుదరలేదు.

అయితే ప్రస్తుతం షూటింగ్‌లు మళ్ళీ ప్రారంభం కావడంతో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కూడా జూలై 16న ఘనంగా ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. అయితే ఈ ప్రారంభోత్సవానికి దర్శకుడు రాజమౌళి, స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం సహా పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిదులుగా విచ్చేయనున్నారట.

సంబంధిత సమాచారం :