రాజమౌళి ప్లాన్ లో మార్పు లేదట !

Published on Apr 10, 2020 3:00 am IST

క‌రోనా మ‌హ‌మ్మారితో సినిమా ఇండస్ట్రీలో ఏర్ప‌డిన క్రైసిస్ అంతా ఇంతా కాదు. సినీ ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌ల‌మవుతుంది. లాక్‌డౌన్ తో సినిమాల షూటింగ్స్ అన్ని ఆపేశారు. దాంతో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియకుండా పోయింది. దర్శకనిర్మాతలు పక్కా ప్లానింగ్ తో రిలీజ్ డేట్స్ ను ముందుగానే ప్రకటించి ఆ దిశగా ముందుకు వెళ్తున్న క్రమంలో సడెన్ గా కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీని స్తంభింప చేసేసింది. దాంతో సినిమాలన్ని పోస్ట్ ఫోన్ అవుతున్నాయని సోషల్ మీడియాలో రూమర్స్ పుట్టుకొస్తున్నాయి.

అందులో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ వచ్చే ఏడాది జనవరి 8న నుండి మళ్ళీ మారే అవకాశం ఉందని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ లో ఎలాంటి వాస్తవం లేదట. కచ్చితంగా అనుకున్న డేట్ కే జనవరి 8న ఈ సినిమా విడుదల కానుందని రాజమౌళి ప్లాన్ లో మార్పు లేదని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More