కొత్త రిలీజ్ డేట్ కోసం చూస్తోన్న రాజమౌళి !

Published on Aug 30, 2021 1:20 pm IST

క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పోస్ట్ ఫోన్ అవ్వక తప్పదా ? ప్రస్తుతం పరిస్థితులు చూస్తే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ కూడా మారే పరిస్థితి ఉంది. అందుకే, రాజమౌళి 2022 సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న తాజా గాసిప్ ఏమిటంటే, రాజమౌళి జనవరి 7వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట.

కాగా దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్యాన్‌ ఇండియా మూవీలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా అలాగే విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

అయితే నేషనల్ రేంజ్ లో కూడా భారీ అంచనాలు ఉన్న నిజమైన మల్టీస్టారర్ కాబట్టి, ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా రిలీజ్ కాదు. అందుకే ఈ సినిమా కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి బయ్యర్లు వెనుకాడటం లేదు.

సంబంధిత సమాచారం :