మహేష్-రాజమౌళి.. ఈ ఏడాది లేనట్టే

Published on Jun 4, 2021 12:05 am IST

త్వరలో సెట్ కాబోతున్న క్రేజీ కాంబినేషన్లలో మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ ఒకటి. జక్కన్నతో మహేష్ సినిమా చేస్తే చూడాలని అభిమానులే కాదు సగటు తెలుగు సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వీరి కలయిక నిజం కాబోతోంది. ఇద్దరూ కలిసి సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. ముందుగా అనుకున్న ప్లాన్స్ మేరకు వీరి ప్రాజెక్ట్ ఈ 2021లోనే లాంఛ్ కావాల్సి ఉంది. షూటింగ్ కూడ ఏడాది ఆఖరులో మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ మూలంగా అది కుదిరేలా కనబడట్లేదు.

ఎందుకంటే రాజమౌళి చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రమే ఇంకా బ్యాలెన్స్ ఉంది. లాక్ డౌన్ నిబంధనలు తొలగితే మిగతా షూట్ కంప్లీట్ చేయాల్సి ఉంది. పైపెచ్చు సినిమా హాళ్లు పూర్తిస్థాయిలో ఎప్పుడు ఓపెన్ అవుతాయో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ విడుదలే ఉంటుందో లేకపోతే వచ్చే ఏడాదికి వెళ్తుందో అనుమానం. కాబట్టి రాజమౌళి ఈ ఏడాది కొత్త సినిమాను పట్టాలెక్కించే సూచనలు కనబడట్లేదు. ఆ ప్రాజెక్ట్ నిర్మాత కె.ఎల్.నారాయణ కూడ ఇదే అంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తికాబడి రిలీజ్ మీద ఒక క్లారిటీ వస్తేనే తమ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు.

సంబంధిత సమాచారం :