ఈ విపత్తుపై షార్ట్ ఫిల్మ్ తో రానున్న రాజమౌళి.!

Published on Jun 5, 2021 8:00 am IST

తన సినిమాలతో ఇపుడు దేశంలోనే మోస్ట్ వాంటెడ్ దర్శకునిగా మారారు దర్శక దిగ్గజం రాజమౌళి.. బాహుబలి సిరీస్ తర్వాత ఇప్పుడు మరి భారీ పాన్ ఇండియన్ సినిమా “రౌద్రం రణం రుధిరం” చేస్తున్న జక్కన్న ప్రస్తుతానికి షూట్ నుంచి స్వల్ప విరామంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితులపై రాజమౌళి అండ్ టీం అంతా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ అవగాహన కల్పిస్తూ వస్తున్నారు.

అలా నిన్ననే పలు సందేహాలపై కూడా ఒక క్లుప్తమైన వీడియో చరణ్, తారక్ సహా ఇతర “RRR” యూనిట్ తో కలిపి చేసి వదిలారు. ఇక ఇప్పుడు రాజమౌళి మరో ఊహించని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఒక 19 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ ను అవగాహన కల్పించేలా హైదరాబాద్ పోలీస్ వారి సహకారంతో దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ షార్ట్ ఫిల్మ్ ను రాజమౌళి త్వరలోనే విడుదల చేస్తున్నట్టు టాక్.. మరి ఎన్నో భారీ చిత్రాలు తీసిన రాజమౌళి నుంచి రాబోయే ఈ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :