తారక్ ఫ్యాన్స్ కోసం జక్కన్న భారీ ప్లాన్స్ చేస్తున్నారా?

తారక్ ఫ్యాన్స్ కోసం జక్కన్న భారీ ప్లాన్స్ చేస్తున్నారా?

Published on May 20, 2020 11:01 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పుట్టినరోజు కోసం తారక్ ఫ్యాన్స్ ఎపుడు లేని విధంగా ఎదురు చూసారు. పర్టిక్యులర్ గా ఈసారి పుట్టినరోజు కోసం ఎందుకు ఎదురు చూసారో అందరికీ తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళితో తీస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” లో తమ అభిమాన నటుడు ఎలా కనిపిస్తాడా దాని తాలూకా స్పెషల్ టీజర్ వీడియో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతగానో ఎదురు చూసారు.

కానీ ఊహించని విధంగా అది కాషాయ మిస్సయ్యింది. కాస్త బాధగా ఉన్నా ఈ విషయాన్ని తారక్ ఫ్యాన్స్ తీసుకోగలిగారు. కానీ తారక్ ఫ్యాన్స్ ఇప్పుడు మిస్సయినా తర్వాత మాత్రం వారి సంబరాలు గట్టిగానే చేసుకునేలా జక్కన్న ప్లాన్స్ గీస్తున్నారట. ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం రాజమౌళి ప్లాన్ చేస్తున్న ఈ వీడియోలో తారక్ డైలాగ్ డెలివరీ కానీ లుక్స్ కానీ విజువల్స్ కానీ ఎక్కడా తగ్గకుండా ఉండేలా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ లాక్ డౌన్ మెల్లగా తీసేసే సమయంలో సాధ్యమైనంత త్వరగా ఓ స్పెషల్ డే నాడు తప్పకుండా వస్తుంది అని వినికిడి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు