ఆర్ ఆర్ ఆర్ కోసం భారీ సీక్వెన్స్ లు తెరకెక్కించలేం..!

ఆర్ ఆర్ ఆర్ కోసం భారీ సీక్వెన్స్ లు తెరకెక్కించలేం..!

Published on May 22, 2020 7:07 AM IST


లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ కు చాలా డామేజ్ జరిగింది. షూటింగ్ ఆగిపోవడంతో విడుదల వాయిదా కానుంది. దీని గురించి దానయ్య క్లారిటీ కూడా ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ జనవరి 2021లో వచ్చే సూచనలు ఏమాత్రం లేవు. ఐతే సాధ్యమైనంత తొందరలో సినిమా ప్రేక్షకుల ముందుకు తేవాలి. అంత కంతకు లేట్ అవుతుంటే అభిమానులలో అసహనం పెరిగిపోతుంది. మరో ప్రక్క మూవీ నిర్మాణ వ్యయం కూడా అనుకున్న దానిని దాటిపోయే ప్రమాదం ఉంది.

ఇక నిన్న ఇండస్ట్రీ పెద్దలు, ప్రభుత్వంతో చర్చలు జరపడం జరిగింది. ఈ సమావేశంలో రాజమౌళి షూటింగ్స్ పునఃప్రారంభం గురించి మాట్లాడారు. తగు జాగ్రత్తలతో షూటింగ్స్ మొదలు పెట్టాల్సిందే అని ఆయన అన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విషయంలో ఇప్పుడు భారీ సిబ్బంది, మరియు నటులతో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించలేం అని చెప్పారు. దీనితో షూటింగ్స్ కి అనుమతి దొరికితే తక్కువ మంది క్యాస్ట్ అండ్ క్రూ పాల్గొనే సన్నివేశాలు తెరకెక్కించాలన్నది రాజమౌళి ప్లాన్. అలా పరిస్థితి పూర్తి అదుపులోకి వచ్చే వరకు షూటింగ్ ఆపకుండా జరపాలనే ఆలోచనలో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు