‘రంగస్థలం’ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానన్న రాజమౌళి !

రామ్ చరణ్, సుకుమార్ ల ‘రంగస్థలం’ టీజర్ నిన్ననే విడుదలై విశేష స్పందనకు దక్కించుకుంది. ప్రేక్షకులు, అభిమానులతో పాటు అనేక మంది సినీ సెలబ్రిటీలు కూడా చరణ్, సుకుమార్ లపై ప్రశంసల జల్లులు కురిపించారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి అయితే టీజర్ చాలా బాగుందని, ఈ సీజన్లో నేను ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రం ఇదేనని అన్నారు.

గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరనే ప్రశ్న రాగానే సుకుమార్ అని, ఆయన నరేషన్, సన్నివేశాల్ని వివరించే తీరు చాలా బాగుంటాయని సమాధానమిచ్చేవారు రాజమౌళి. చరణ్ తో కూడా మంచి మిత్రుత్వం కలిగిన ఆయన తన తర్వాతి సినిమాను చరణ్, ఎన్టీఆర్ లతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ‘రంగస్థలం’ మార్చి 30న రిలీజ్ కానుంది.

టీజర్ కొరకు క్లిక్ చేయండి :