రాజమౌళిని మెప్పించిన ఉమామహేశ్వరరావు

Published on Feb 21, 2020 8:14 pm IST

‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రంతో మెప్పించిన దర్శకుడు వెంకటేష్ మహా ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. సత్యదేవ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం యొక్క టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. టీజర్ చాలా కూల్ అనేలా ఉంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి సైతం టీజర్ పట్ల ఇంప్రెస్ అయ్యారు. టీజర్ చాలా ప్లజెంట్ గా ఉంది. సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

2016లో వచ్చిన మలయాళ చిత్రం ‘మహేషింటె ప్రతీకారం’ అనే చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని ‘కేరాఫ్ కంచరపాలెం’ నిర్మాతలతో కలిసి శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఏప్రిల్ 17వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. వెంకటేష్ మహా ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రాన్ని హ్యాండిల్ చేసిన విధానం పట్ల ఇంప్రెస్ అయిన ప్రేక్షకులు ఈ సినిమా పట్ల ఆసక్తిగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

X
More