‘బందోబస్త్’గా వస్తానంటున్న సూర్య

‘బందోబస్త్’గా వస్తానంటున్న సూర్య

Published on Jun 28, 2019 7:00 PM IST

కెవి ఆనంద్ దర్శకత్వంలో హీరో సూర్య చేస్తున్న కొత్త చిత్రం ‘కాప్పన్’. ఇందులో సూర్య పవర్ఫుల్ కమాండో ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన మంత్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం యొక్క తెలుగు ఫస్ట్ లుక్, టైటిల్ కొద్దిసేపటి క్రితమే స్టార్ డైరెక్టర్ రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ అయ్యాయి.

ఈ సినిమాకు తెలుగులో ‘బందోబస్త్’ అనే టైటిల్ ఖరారు చేశారు. గతంలో సూర్య, కెవి ఆనంద్ కలయికలో ‘వీడొక్కడే, బ్రదర్స్’ లాంటి భిన్నమైన చిత్రాలు రాగా ఇది వారి మూడవ సినిమా. ఇందులో సాయేషా సైగల్ కథానాయికగా నటించగా హీరో ఆర్య ఒక కీలక పాత్ర చేశారు. ఆగష్టు 30వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. గత చిత్రాలు మూడు ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నారు సూర్య.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు